FbTelugu

సంక్రాంతి బరిలో బంగార్రాజు.

సొగ్గాడే చిన్నినాయన సినిమా ఘన విజయం తర్వాత ఆ సినిమాకు సీక్వెల్‌గా బంగార్రాజు వస్తున్నది. ఈ సినిమా జనవరి 14వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో బంగార్రాజుపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఇలాంటి అంచనాల మధ్య వచ్చిన బంగార్రాజు ఎలాంటి అనుభూతిని కలిగించాడు? సంక్రాంతి రేసులో విజేతగా నిలిచాడా? చిన్న బంగార్రాజు పరిస్థితి ఏమిటి అనే విషయాలు తెలుసుకోవాలంటే.. బంగార్రాజు కథ, కథనాలు తెలుసుకొందాం పదండి..

రాము (నాగార్జున) సీత (లావణ్య త్రిపాఠి) కాపురాన్ని చక్కదిద్దిన బంగార్రాజు (నాగార్జున)కు నేరుగా స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది. అయితే సీత ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చి చనిపోవడంతో రాము జీవితంలో ఊహించిన సంఘటన చోటు చేసుకొంటుంది. తన కుమారుడికి బంగార్రాజు ( నాగచైతన్య) అని నామకరణం చేసి.. సీత మరణంతో కలిగిన బాధను మరిచిపోవడానికి రాము అమెరికా వెళ్లిపోతాడు. బంగార్రాజు పెరిగి పెద్ద అయిన తర్వాత సత్తెమ్మ మరణించడంతో బంగార్రాజు ఒంటరివాడైపోతాడు. శివపురంలో రమేష్ (రావు రమేష్) కూతురు నాగలక్ష్మీ (సర్పంచ్) ఎన్నికవుతుంది. మరదలు నాగలక్ష్మితో చిన్న బంగార్రాజుకు ఎప్పుడు చిలిపి తగాదాలే. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న బంగార్రాజు ప్రాణాలకు ముప్పు కలగడంతో బంగార్రాజు మళ్లీ శివపురంకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఎలాంటి పరిస్థితుల్లో ప్రేమ కలిగింది? నాగలక్ష్మి అంటే ఇష్టం కలుగడానికి చిన్న బంగర్రాజుకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? నాగలక్ష్మి, చిన్న బంగార్రాజు పెళ్లికి రానని చెప్పిన రాము అమెరికా నుంచి ఎందుకు వచ్చాడు? చిన బంగార్రాజు ప్రాణాలకు ఏర్పడిని ముప్పును బంగార్రాజు, రాము ఎలా తొలగించారు అనే ప్రశ్నలకు సమాధానమే బంగార్రాజు సినిమా కథ.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.