FbTelugu

పూర్తి లాక్ డౌన్ దిశగా బెంగళూర్

బెంగళూరు: నగరంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

కేసుల నియంత్రణకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. లాక్ డౌన్ ఆంక్షలు సడలింపులను ప్రజలు సద్వినియోగం చేసుకోకుండా ఇష్టానుసారంగా తిరగడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నది. కట్టడి కోసం  నగరంలో మరోసారి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.

దీనిపై కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు స్పందించారు. ఇప్పటికే నగరంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నాలుగు ప్రాంతాలను సీల్ చేయడం జరిగిందని తెలిపారు. కేసులు నమోదు ఇదే విధంగా కొనసాగితే బెంగళూరులో లాక్ డౌన్ విధిస్తామని ఆయన స్పష్టం చేశారు. పూర్తి లాక్ డౌన్ పై కోవిడ్ టాస్క్ ఫోర్స్, అధికారులు, మేధావుల సలహాలు సూచనలను కూడా తీసుకుని తుది నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి శ్రీరాములు చెప్పారు.

You might also like