FbTelugu

టిఆర్ఎస్ నేతల బండారం విప్పుతాం: బండి సంజయ్

హైదరాబాద్: రాష్ట్రంలో 77 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులపై భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఎంత మంది ఐఏఎస్, అధికారులతో విచారణ చేయిస్తారంటూ సవాల్ విసిరారు.

ఇవాల బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, మంత్రి ఈటల రాజేందర్ అసైన్డు భూములు కొనుగోలు చేశారని చెబుతున్న మెదక్ మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి కూడా కట్టు తప్పారన్నారు. టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల ఒత్తిడితోనే అసైన్డు భూములను రిజిస్ట్రేషన్ చేశామని ధర్మారెడ్డి ఒప్పుకున్నారన్నారు. భూ కబ్జాలు, అసైన్డు భూముల కబ్జాలపై టిఆర్ఎస్ నాయకులతో పాటు అధికారులపై విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భూ కబ్జాలపై మీడియాలో పత్రికల్లో వార్తలు వచ్చినా ఇంత వరకు విచారణకు కెసిఆర్ ఆదేశించలేదన్నారు. కొద్ది రోజుల్లోనే మంత్రులు, ఎమ్మెల్యేల భూ కబ్జాలపై ఆధారాలతో సహా బయటపెడతామన్నారు. ఈటలపై చర్యలు తీసుకుంటున్న కెసిఆర్ మిగతా వారిపై కూడా చర్యలు తీసుకుంటారనే నమ్మకం కలిగిందని సంజయ్ జోస్యం చెప్పారు. కరోనా రావడంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.

సిఎం కెసిఆర్ చేతగానితనం మూలంగానే ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయని, ఇప్పటికైనా బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేదోళ్ల ప్లాట్లను ఎల్ఆర్ఎస్ పేరుతో ఆపేశారని, వీళ్లు మాత్రం బరితెగించి భూములను దోచుకుతింటున్నారన్నారు. రాష్ట్రంలో కరోనాతో పిట్టల మాదిరి చనిపోతున్నా లెక్కలు సక్రమంగా చెప్పడం లేదని, కెసిఆర్ ఇంత వరకు సమీక్ష చేయలేదన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమీక్షలు చేస్తుంటే కెసిఆర్ తాగుతూ ఫామ్ హౌస్ ల నిద్రపోతున్నారన్నారు. బూతు ఛానల్ టి న్యూస్, నమస్తే తెలంగాణ దిన పత్రిక పై బండి సంజయ్ మండిపడ్డారు. ఇప్పటి వరకు కెసిఆర్ వ్యాక్సిన్ వేసుకోలేదని, ఎందుకు వేసుకోలేదో సమాధానం చెప్పాలన్నారు. అందుకే ఆయనకు కరోనా వచ్చిందని బండి సంజయ్ అన్నారు. ఈ సమావేశంలో ఎంపి ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.