FbTelugu

కెసిఆర్ అంత దుర్మార్గుడు లేడు: బండి సంజయ్

హైదరాబాద్: కరోనాతో చనిపోయిన వారి లెక్కలు దాస్తూ ఫామ్ హౌస్ లో పడుకుంటున్న దుర్మార్గుడు సిఎం కెసిఆర్ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు.

కరోనా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాటిని వాడుకోలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని దుయ్యపట్టారు. కరోనా వైరస్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు తప్పుడు లెక్కలు చూపిస్తూ జనాన్ని మభ్యపెడుతున్నరని ఆయన ఆరోపించారు. మరణాలు, కేసుల సంఖ్య తక్కువ చూపించడం వల్ల వైరస్ తీవ్రత ప్రజలకు తెలియడం లేదన్నారు. సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నా, హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదన్నారు. కరోనా పరిస్థితులపై వెంటనే సిఎం కెసిఆర్ అఖిలపక్షం ఏర్పాటు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు

You might also like

Leave A Reply

Your email address will not be published.