FbTelugu

త్వరలో బండి సంజయ్ పాదయాత్ర

హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎం.పి బండి సంజయ్ రాష్ట్రంలో పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. వచ్చే నెలాఖరులో ఈ పాదయాత్ర ను ప్రారంభించనున్నట్లు సమాచారం.

సంజయ్ పాదయాత్ర ను సుమారు రెండు నెలల పాటు కొనసాగించి హుజూరాబాద్ నియోజకవర్గంలో ముగించనున్నారు. ఎక్కడి నుంచి పాదయాత్ర చేయాలి, ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ కొనసాగాలి, పాయాత్రలో ఎంత మంది ఉండాలనే అంశాలపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సర్వే బృందాలు రంగంలోకి దిగా వివరాలసు సేకరిస్తున్నాయి. వాస్తవానికి పాదయాత్రను గ్రేటర్ హైదరాబాద ఎన్నికల ముందు నిర్వహించాలని భావించగా కుదరలేదు. ఆ తరువాత ఎన్నికలు రావడంతో వాయిదా పడ్డాయి. మళ్లీ ఆ పాదయాత్ర ఇప్పుడు తెరమీదికి వచ్చింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.