FbTelugu

మంత్రి అజయ్ జైలుకెళ్లడం ఖాయం: సంజయ్

ఖమ్మం: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను జైలుకు పంపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. ఖమ్మంలో ప్రభుత్వ భూములు కబ్జా చేసేందుకే ఆయన ఎర్రజెండా, కాంగ్రెస్ పార్టీ విడిచి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారన్నారు.

మమత మెడికల్ కాలేజీ పేరుతో భూములు దోచుకున్న సంగతి ప్రజలకు, జిల్లా అధికారులకు తెలుసని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి అమాంతం పెరిగిపోయిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవడం, ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ నాయకులు చేసిన ఆగడాలపై చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి అజయ్ కుమార్ కు కొమ్ము కాస్తున్న అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని సంజయ్ హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.