FbTelugu

బండి సంజయ్ కు దమ్ములేదు: కెటిఆర్

సిరిసిల్ల: కేంద్రంలో తమదే ప్రభుత్వం ఉందని గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చే దమ్ము ఉందా అని మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ సవాల్ విసిరారు.

ఇల్లంతకుంట మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు కెటిఆర్ ప్రారంభించిన తరువాత సభలో ఆయన మాట్లాడారు. ఎంపి గా ఉన్న బండి సంజయ్ రెండేళ్లలో కరీంనగర్ కు ఒక్క పైసా అయినా తెచ్చారా అని నిలదీశారు. మతం పేరుతో నిత్యం రెచ్చగొట్టడం, చిల్లర మాటలు మాట్లాడి రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. దమ్ముంటే తమతో అభివృద్ధిలో పోటీపడాలని, కాళేశ్వరం లేదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలన్నారు. దుబ్బాకలో గెలిచినవాళ్లు రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు ఓడిపోయారని అన్నారు. నాగార్జున సాగర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుస్తున్నదని అన్నారు. అక్కడ బిజెపికి డిపాజిట్ కూడా దక్కదని కెటిఆర్ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.