FbTelugu

హరీష్ కు అగ్గిపెట్టె దొరకడం లేదు: బండి సంజయ్

హైదరాబాద్: ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్ రావు అగ్గిపెట్టె కోసం ఇంకా వెతుకుతునే ఉన్నాడని, ఉద్యమంలో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న హరీష్ రావుకు అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదో? తనకు అర్థం కావడం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్ రావుకు అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదే సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బండి సంజయ్ మీడియా చిట్ చాట్ లో ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్ రావుపై సెటైర్లు వేశారు. శ్రీకాంతాచారికి దొరికిన అగ్గిపెట్టె .. హరీష్ రావుకు దొరకదా?. హరీష్ రావు అంటేనే అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో అబద్దాలు చెప్పినందుకే హరీష్ రావు వీపు సాఫ్ అయిందన్నారు. శాసనసభలో లేని వ్యక్తి గురించి విమర్శలు చేయకూడాదని సీనియర్ గా చెప్పుకున్న హరీష్ రావుకు తెలియదా? అని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడింది నిజం కాదా అని సంజయ్ ప్రశ్నించారు.
ఏపీ ప్రభుత్వం అనుమతి లేకుండా నిర్మిస్తోన్న ప్రాజక్టులను అడ్డుకోవాలని మాత్రమే లేఖ రాశాను. సీఎం కేసీఆర్ పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించిన అంశాన్ని వదలను అన్నారు. లోకసభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా కోవిడ్ నుంచి కోలుకున్న వెంటనే కేసీఆర్ పై ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్ పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించిన విషయం బయటకు వచ్చాక సంచలనం అవుతోందని బండి సంజయ్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.