FbTelugu

కరీంనగర్ లో బంద్… డ్రైవర్ ఇంటి వద్ద ఉద్రిక్తత

కరీంనగర్‌: కరీంనగర్ పట్టణంలో బంద్ కొనసాగుతోంది. సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన సకల జన భేరీలో గుండెపోటుతో మరణించిన ఆర్టీసీ డ్రైవర్ బాబు మృతదేహాన్ని కరీంనగర్ కు తరలించారు. అరెస్టు చేసిన కార్మికులను విడుదల చేసిన తరువాతే అంత్యక్రియలు చేస్తామని ఆయన కుటుంబ సభ్యులు స్పష్టం చేయడంతో ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో బాబు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇవ్వాళ తెల్లవారుజామున ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంపీ బండి సంజయ్ కూడా డ్రైవర్‌ బాబు ఇంటి వద్దే బైఠాయించారు.

You might also like