FbTelugu

అనంతపురంలో 6 నుంచి 6 వరకు బంద్

అనంతపురం: కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. అన్ని వ్యాపార సంఘాల నేతలతో సమావేశమై కరోనాపై చర్చించారు.

జిల్లాలో కరోనా ఉధృతి దృష్ట్యా ప్రతి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్ని రకాల వ్యాపారాల మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానం సోమవారం నుంచి జిల్లాలో అమలవుతుందని చాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపారు. రాష్ట్రంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ శనివారం రాత్రి నుంచి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి అదనంగా ఐదు గంటలు అనంతపురంలో అమలు చేస్తుండడం విశేషం.

You might also like

Leave A Reply

Your email address will not be published.