FbTelugu

గెలుపు ర్యాలీలపై నిషేధం: ఈసీ

న్యూఢిల్లీ: వచ్చే నెల మే 2వ తేదీన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఓట్ల లెక్కింపు తరువాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసి) ప్రకటించింది. ఎన్నికల ప్రచార సభల్లో కరోనా నిబంధనలు పాటించడం లేదని మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నా రాజకీయ నాయకులు ర్యాలీలు, ప్రచార సభలు నిర్వహిస్తున్నారని ఆగ్రహించింది. దేశంలో సెకండ్ వేవ్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసి) అని, ఈసి కమిషనర్లపై మర్డర్ కేసు నమోదు చేయాలని మద్రాస్ హైకోర్టు మండిపడింది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. జరగాల్సిన నష్టం జరిగిన తరువాత ఈసి ఇప్పుడు మేల్కోవడం విచిత్రంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. ఒకవైపు కరోనా ఉధృతంగా ఉంటే మరో వైపు ఐదు రాష్ట్రాల్లో ప్రచారం చేసుకునేందుకు ఈసి అవకాశం కల్పించిందని, ప్రేక్షక పాత్ర పోషించిందని పలువురు భగ్గుమంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.