FbTelugu

అరెస్టు చేస్తేనే అంత్యక్రియలు చేస్తాం…

చండీగఢ్: బల్విందర్ సింగ్ సంధూ ను కాల్చి హత్య చేసిన వారిని అరెస్టు చేసే వరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఇది ముమ్మాటికి ఉగ్రవాదుల పనేనని, వారిని పట్టుకునే వరకు సంధూ భౌతికకాయాన్ని కదలనిచ్చేది లేదని వారు పోలీసులకు తెగేసి చెప్పారు.
పంజాబ్ లోని తరన్ తారన్ జిల్లాలో లిఖీవిండ్ లో శుక్రవారం శౌర్యచక్ర బల్విందర్ సింగ్ సంధూను ఇద్దరు అగంతకులు సమీపం నుంచి కాల్చి చంపారు. ఆ వెంటనే కుటుంబ సభ్యులను ఆయనను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది.

ఖలిస్థాన్ వేరువాదులకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన కుటుంబాన్ని 1993లో శౌర్య చక్ర అవార్డు ను బహూకరించింది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను తొలగించింది. సంధూ హత్యపై ఆయన భార్య జగ్దిశ్ కౌర్ మాట్లాడుతూ, మా కుటుంబం మొత్తం శౌర్యచక్ర అవార్డులు అందుకున్నదని, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడామని తెలిపారు. తనతో పాటు తన భర్త సంధూ, ఆయన సోదరుడు రంజిత్ సింగ్ సంధూ, రంజిత్ భార్య బల్ రాజ్ కౌర్ కూడా శౌర్య చక్ర అవార్డుతో సత్కరించారన్నారు. తన భర్త హత్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.