FbTelugu

రేపు ఫామ్ హౌస్ లో బాలు అంత్యక్రియలు

చెన్నై: దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు శనివారం సాయంత్రం ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

బాలు మృతితో చిత్ర పరిశ్రలో విషాదం నెలకొన్నది. ఆయన చనిపోయాడనే వార్తలను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చెన్నై సమీపంలోని కాదార్ నగర్ లో ఆయన నివాసానికి సాయంత్రం 4 గంటలకు భౌతిక కాయాన్ని తరలించనున్నారు. శనివారం ఉదయం వరకు ఇంటి వద్దనే పెట్టి, అభిమానుల సందర్శనార్థం సత్యం థియేటర్ కు తీసుకువెళ్లనున్నారు. మధ్యాహ్నం తరువాత నగర శివారు రెడ్ హిల్స్ లోని ఆయన వ్యవసాయ క్షేత్రానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.