FbTelugu

తుఫానుగా మారిన వాయుగుండం

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. తుఫాన్ కు ‘బురేవీ’గా నామకరణం చేశారు. తుఫాన్ కేంద్రం శ్రీలంకలోని త్రికోణమలైకి 4 వందల కిలోమీటర్ల దూరంలో క్రేంద్రీకృతమైనట్టుగా గుర్తించారు.

మరో రెండ్రోజుల్లో బురేవీ తుఫాను కన్యాకుమారి, పాంబన్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తీర ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.