FbTelugu

పాకిస్థాన్‌లో బాలయ్య క్రేజ్.

  1. Nanadamuri Balakrishna Fans

Balayya Craze in Pakistan ; పాకిస్థాన్‌లో ననదమూరి బాలకృష్ణ అభిమానులు.నటసింహ, బాక్సాఫీస్ బొనాంజా నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. డిసెంబర్ 2వ తేదీన ప్రారంభమైన ఈ చిత్రం ఇంకా థియేటర్లలో ప్రదర్శించబడుతూ.. 50 రోజుల పండుగను జరుపుకొనేందుకు పరుగులు పెడుతున్నది. ఇలాంటి పండుగ లాంటి వాతావరణంలో అఖండ చిత్ర యూనిట్ థ్యాంక్యూ మీట్ జరుపుకొన్నది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ..
అఖండ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కింది. దాంతో ఈ సినిమా ప్యాన్ ఇండియా సినిమానే కాకుండా ప్యాన్ వరల్డ్ సినిమాగా నిలిచింది. పాకిస్థాన్‌లో కూడా ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారనే విషయం చాలా సంతోషం కలిగించింది. పాకిస్థాన్‌లో ఈ సినిమా ప్రదర్శిస్తున్నారనే విషయం వాట్సాప్‌లో ఓ వీడియో నాకు నా మిత్రుడు షేర్ చేశారు. స్వచ్ఛమైన మనసుతో అంకితభావంతో విజయం లభిస్తుందనే విషయాన్ని ప్రేక్షకులు రుజువు చేశారు అని బాలకృష్ణ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.