FbTelugu

జూలై మొదటి వారంలో బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభం

హైదరాబాద్: బాలానగర్ పారిశ్రామిక వాడలో భారీ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. ప్రారంభోత్సవానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. జూలై నెల మొదటి వారంలో ప్రారంభించనున్నారు.

ట్రాఫిక్ కష్టాలను గట్టెక్కించేందుకు రూ.387 కోట్లతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పనులు ప్రారంభించారు. భూ సేకరణకు రూ.265 కోట్లు ఖర్చు కాగా, ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.122 కోట్లు మంజూరు చేశారు. 2017 సంవత్సరంలో దసరా రోజున మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. గడువు ప్రకారం 2019 లోనే అందుబాటులోకి రావాల్సి ఉండగా స్థల సేకరణ మూలంగా ఆలస్యమైంది. 1.3 కిలోమీటర్ల పొడవునా మూడు లేన్లతో నిర్మించిన ఫ్లై ఓవర్ తో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తీరునన్నది. నగరం నుంచి మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ వెళ్లేవారికి ఈ ఫ్లైఓవర్ ఉపయోగపడనున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.