FbTelugu

సినిమా ఇండస్ట్రీకి బాలకృష్ణ హీరోకాదు: నాగబాబు

హైదరాబాద్: సినీ నటుడు బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా నాగబాబు పలు విమర్శలు చేశారు. బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీకి హీరో ఏమీ కాదని ఆయన అందరిలానే ఓ నటుడని అన్నారు. తెలంగాణలో సినీ ప్రముఖులెవరూ రియల్ ఎస్టేట్ చేయడం లేదని టీడీపీ వాళ్లే చేస్తున్నారన్నారు.

ఆ విషయం ఏపీలో త్వరలోనే తెలుస్తుందన్నారు. మీరేం మాట్లాడినా చూస్తూ కూర్చుంటారని అనుకుంటున్నారా ? అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీకి, తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

You might also like