FbTelugu

60వ పడిలోకి బాలకృష్ణ

న్ను కలిసేందుకు ఎవరూ రావొద్దు

హైదరాబాద్: హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం నాడు ఆరు వసంతాల్లోకి అడుగు పెడుతున్నారు. జూన్ 10వ తేదీ తన జన్మదినం సందర్భంగా కలిసేందుకు ఎవరు కూడా తన నివాసం వద్దకు రావొద్దని బాలకృష్ణ సామాజిక మాధ్యమాల ద్వారా కోరారు.

ప్రపంచంలో నలుమూలలా ఉన్న అభిమానులకు నా ఆత్మయ వినతి అని ఒక పోస్టు పెట్టారు. ఆరు వసంతాల్లోకి అడుగు పెడుతున్న తన జన్మదినాన్ని కనీవినీ ఎరుగని రీతిలో సంబురాలు చేసుకుంటున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

మీ అందరితో కలిసి జన్మదిన వేడుకులు జరుపుకునేందుకు అవాంతరం ఏర్పడినందుకు బాధగా ఉందన్నారు. ఈ విపత్కర సమయంలో మీ ఆరోగ్యం గురించి ఆలోచించడం నా బాధ్యత అని అన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తనను కలిసేందుకు ఎవరూ రావొద్దని బాలకృష్ణ కోరారు.

You might also like