FbTelugu

వర్మను అమృత తిట్టలేదు: బాలస్వామి ఖండన

మిర్యాలగూడ: సోషల్ మీడియాలో అమృత పేరిట వస్తున్న కథనాల్లో ఎంతమాత్రం నిజం లేదని మామ బాలస్వామి స్పష్టం చేశారు.

రామ్ గోపాల్ వర్మ సినిమా మర్డర్ పై అమృత ఇంత వరకు స్పందించలేదని ఆయన స్పందించారు. ఆమె పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న స్టేట్ మెంట్లను నమ్మొద్దని విన్నవించారు. మిర్యాలగూడలో పరువు హత్య కథనంతో మర్డర్ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రం అమృత, ప్రణయ్, మారుతీరావుల కథేనని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో వర్మపై అమృత తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి. వర్మ పాదర్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ చూడగానే ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని ఆమె అన్నట్టు స్టేట్ మెంట్లు కుప్పలు కుప్పలుగా వచ్చాయి. అయితే అమృత విమర్శకు వర్మ కూడా సమాధానం చెప్పారు. ఈ సినిమా వాస్తవ గాథ ఆధారంగా రూపొందుతుందని చెప్పానే కాని… నిజమైన స్టోరీ అని చెప్పలేదని స్పష్టం చేశారు.

You might also like