FbTelugu

వరవరరావుకు బెయిల్ మంజూరు

ముంబయి: విప్లవ రచయితల సంఘం (విరసం) నాయకుడు పి.వరవరరావు కు ముంబయి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని బెయిల్ ఇచ్చింది.

ఆరు నెలల పాటు ముంబయిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. ముంబయి ని విడిచి ఎక్కడకి వెళ్లడానికి వీల్లేదని పేర్కొన్నది. జైలులో కరోనా నిర్ధారణ కావడంతో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ వ్యాధితో ఇతర రోగాలు తిరగబెట్టాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపా నిరోధక చట్టం కింద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 2018 జూన్ 18న వరవరరావును మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన జైలులోనే మగ్గుతున్నారు. పలుమార్లు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసినప్పటికీ మంజూరు కాలేదు. చివరకు ఈరోజు ముంబయి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.