న్యూఢిల్లీ: భారతీయ సంగీత శిఖరం ఏఆర్ రెహమాన్ కు బాఫ్టా(బ్రిటీష్ అకాడెమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) అరుదైన గౌరవం ఇచ్చి సత్కరించింది. రెహమాన్ ను ఇండియన్ బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ అంబాసిడర్ గా నియమించింది.
తాజా నియామకంతో రెహమాన్ నెట్ ఫ్లిక్స్ తో కలిసి భారత్ లో సినిమాలు, క్రీడలు, కళలు వంటి పలు రంగాల్లోని అద్భుత నైపుణ్యం ఉన్నవారిని గుర్తించనున్నారు. భారత్ లో ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించడం తనకు ఆనందంగా ఉందని రెహ రెహమాన్ తెలిపారు.