FbTelugu

ఇషాంత్ బంతులకు బంగ్లాదేశ్ బెంబేలు

కోల్ కతా: ఇషాంత్ శర్మ బంతులకు బంగ్లాదేశ్ టీమ్ చిత్తయింది. తొలి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో కూడా పేలవంగా ప్రదర్శన కొనసాగిస్తున్నది. రెండో రోజు ఆటలో భాగంగా శనివారం నాడు బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించింది. తొమ్మిది పరుగులకే మూడు వికెట్లను కోల్పోయి బలహీనమైంది. ఓపెనర్ షాద్ మన్ ఇస్లామ్, మోమినుల్ హక్ లను ఇషాంత్ డకౌట్ చేశాడు. ఆ తరువాత మహ్మద్ మితున్ (6)ను ఉమెష్ యాదవ్, ఇమ్రుల్ కెయిస్ (5)ను ఇషాంత్ ఔట్ చేశాడు. 13 పరుగులకే బంగ్లాదేశ్ 4 వికెట్లను కోల్పోయింది. అయితే ఏడో ఓవర్ లో ఇషాంత్ వేసిన బాల్ కు ఇమ్రుల్ విరాట కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు.

You might also like