FbTelugu

సీఎం జగన్ కు ఎదురుదెబ్బ

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమించాలి

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారం పై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టి పారేసింది.

ఆయనను తొలగిస్తూ ఏపీ సర్కార్ తీసుకువచ్చిన రెండు జీఓలు చెల్లవంటూ తిరస్కరించింది. రమేష్ కుమార్ ను తిరిగి ఎన్నికల కమిషనర్ గా నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రిటైర్డు ఐఏఎస్ స్థానంలో రిటైర్డు హైకోర్టు జడ్జీని ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్ నిబంధనలకు విరద్దుదమని స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.