FbTelugu

విరాట్-అనుష్క దంపతులకు పండంటి ఆడబిడ్డ

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-నటీమణి అనుష్క శర్మ దంపతులకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా విరాట్ కోహ్లీ అధికారికంగా ప్రకటించాడు.

ఇవాళ మధ్యాహ్నం అనుష్క ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని తెలియచేస్తున్నందుకు సంతోషంగా ఉందని విరాట్ పేర్కొన్నాడు. మీ ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. అనుష్క, బేబీ ఆరోగ్యంగా ఉన్నారని, మా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని ట్వీట్ చేశాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.