FbTelugu

బురద జల్లడమే బాబు పని : మంత్రి కన్నబాబు

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ పై బురద జల్లడమే చంద్రబాబు పని అని
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఇవాళ ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబుకు అమరావతి రైతులు తప్ప మిగతా రైతులు కనిపించడంలేదని ఎద్దేవా చేశారు.

సీఎం జగన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేలు నిర్వహిస్తుంటే గాలి సర్వేలంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేశారన్నారు. గతంలో రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసింది. చంద్రబాబేనని అన్నారు. డిసెంబరు నెలాఖరు నాటికి వరద బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు. వరదల సమయంలో ముందు జాగ్రత్తలు తీసుకున్నామని, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.