FbTelugu

రేపు చిత్తూరు కు బాబు

Babu-to-Chittoor-tomorrow

తిరుపతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు బుధవారం సొంత జిల్లా చిత్తూరు కు రానున్నారు. మూడు రోజుల పాటు జిల్లాలో మకాం వేసి పార్టీ కార్యకర్తలు, నాయకులు, వివిధ నియోజకవర్గాల శ్రేణులతో సమావేశమవుతారు. మొదటి రోజు జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొనడంతో పాటు మూడు నియోజకవర్గాల పార్టీ స్థితిగతులపై సమీక్షిస్తారు. రెండోరోజు జిల్లావ్యాప్తంగా వైసీపీ నేతల బాధితులతో ముఖాముఖి మాట్లాడిన తరువాత ఆరు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై అక్కడి నాయకులు, కార్యకర్తలతో సమీక్ష చేస్తారు.

చివరి రోజు జిల్లా పార్టీ సమన్వయ కమిటీతో సమావేశమై, చంద్రగిరి, కుప్పం సహా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితపై సమీక్షిస్తారు. చంద్రగిరి మండలం మామండూరు సమీపంలో జరిగే ఈ మూడు రోజుల కార్యక్రమాల కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు.

You might also like