FbTelugu

తిరుపతిలో బాబు వారం రోజుల మకాం

తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొనేందుకు టిడిపి అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు.

ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుపతి బయలుదేరారు. తిరుపతిలో నేటి నుంచి వారం రోజుల పాటు తిరుపతి ఉపఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేణిగుంట పాత చెక్‌పోస్ట్‌ సమీపంలోని వై కన్వెన్షన్‌ సెంటర్‌లో ఉప ఎన్నికలపై నేతలతో సమీక్షిస్తారు. మధ్యాహ్నం మూడున్నర గంటల తర్వాత శ్రీకాళహస్తి బయలుదేరి వెళ్లనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.