FbTelugu

విమనాశ్రయంలోనే బాబు నిరసన

తిరుపతి: పోలీసులు అడ్డుకోవడంతో మాజీ సీఎం చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయం లో ఆందోళనకు దిగారు.

చంద్రబాబుతో పాటు ఆయన పీఏ, వైద్య అధికారి ఇతరుల ఫోన్లను బలవంతంగా లాక్కుంటున్నారు. జిల్లా కలెక్టర్, తిరుపతి, చిత్తూరు ఎస్పీలకు తన పర్యటన అడ్డుకున్న తీరుపై వినతిపత్రం ఇచ్చి వెళ్తానని పోలీసులకు తెలిపినా వినిపించుకోలేదు. అధికారులను కలిసేందుకు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసులతో వాదనకు దిగారు. అనుమతి ఇచ్చే వరకు విమానాశ్రయంలోనే తన నిరసన కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ప్రతిపక్షనేతగా కలెక్టర్, ఎస్పీలను కలిసే హక్కు తనకు లేదా నిలదీశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.