FbTelugu

గుంటూరు లో బాబుకు అనుమతి నిరాకరణ

గుంటూరు: టీడీఎల్పీ ఉప నేత కె.అచ్చెన్నాయుడును కలిసేందుకు వచ్చిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు జీజీహెచ్ సూపరింటెండెంట్ అనుమతి నిరాకరించారు.

అనుమతి నిరాకరించడంతో జీజీహెచ్ సూపరింటెండెంట్‌తో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. దీంతో చేసేది లేక ఆయన అక్కడి నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లిపోయారు.

అరెస్టు కు ఒకరోజు ముందే ఆపరేషన్ చేయించుకున్న అచ్చెన్నాయుడిని 500 కిలోమీటర్ల వరకు వాహనాల్లో తీసుకొచ్చారని ఆరోపించారు. పోలీసులు గోడలు దూకి అచ్చెన్నను అరెస్ట్‌ చేయడం బాధాకరం అన్నారు. ఒక టెర్రరిస్టులా అచ్చెన్నాయుడిని అరెస్ట్‌ చేశారు. ఆపరేషన్‌ అయిందని చెప్పినా పోలీసులు వినలేదన్నారు. పోలీసులు నేరుగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లి అరెస్ట్‌ చేశారని చంద్రబాబు విమర్శించారు.

అధికారం శాశ్వతం కాదని సీఎం జగన్ రెడ్డి గుర్తించాలన్నారు. వైసీపీ అరాచకాలను ప్రజలు సహించరన్నారు. వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారన్నారని చంద్రబాబు ఆరోపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.