FbTelugu

కోర్టులను అడ్డుపెట్టుకుని బాబు డ్రామా: సజ్జల రామకృష్ణ

తాడేపల్లి: కోర్టులను వేదికలుగా చేసుకొని రాష్ట్ర అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు అడ్డం పడుతున్నారని ప్రభుత్వ ప్రజా సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి విమర్శించారు.

ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. యజ్ఞాని కు రాక్షసులు అడ్డం పడినట్లు జగన్మోహన్ రెడ్డి చేసే మంచి పనులకు చంద్రబాబు అడ్డం పడుతున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. తన బినామిలను రక్షించుకొనేందుకు అమరావతి ఉద్యమం చేయిస్తున్నారు. వేల కోట్లు కొల్ల గొట్టే అవకాశం కొల్పవడంతో చంద్రబాబు అమరావతిని రాష్ట్ర సమస్యగా చిత్రీకరిస్తున్నాని రామకృష్ణారెడ్డి అన్నారు.
అమరావతిలో 11 వేల మంది రైతులు ఉన్నారు. వారికి ఎలా న్యాయం చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసారు కాబట్టే లోకేష్ ను మంగళగిరిలో ఓడించారు. ఇద్దరు రమేష్ ల గురించి తప్ప చంద్రబాబు ఏమి ఆలోచన చేయలేదు. సొంత కులానికి కూడా చంద్రబాబు అన్యాయం చేస్తున్నారుని, ఒక్క కూలనికే పరిమితమయ్యారన్నారు. సీఎం జగన్ కులాలు, మాతాలకు, రాజకీయాలకు అతీతుడన్నారు.

విధ్వసాని కు మారు పేరు జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏమి విధ్వసం జరిగిందో ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశానికే ఆదర్శవంతమైన పథకాలు పెట్టడం విధ్వంసమా..?. అవినీతి రహిత పాలన అందించడం విధ్వసమా..?. కరోనా వంటి విపత్కర పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనడం విధ్వంసమా అని సజ్జల రామకృష్ణా రెడ్డి అడిగారు.

You might also like