FbTelugu

సమాచార కమిషనర్ల ఎంపిక భేటీకి బాబు డుమ్మా

అమరావతి: రాష్ట్ర సమాచార హక్కు (ఆర్టీఐ) కమిషన్ ప్రధాన కమిషనర్, కమిషనర్ల ఎంపిక కమిటీ సమావేశానికి మాజీ సీఎం చంద్రబాబు గైర్హాజరు అయ్యారు.
ప్రధాన కమిషనర్, కమిషనర్ల ఎంపికకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్.జగన్ రెడ్డి నేతృత్వంలోని కమిటీ ఇవాళ సమావేశమైంది.

సచివాలయంలోని సీఎం కార్యాలయంలో జరిగిన కమిటీ సమావేశానికి కమిటీ ఛైర్మన్, సీఎం జగన్ రెడ్డి, ఎంపిక కమిటీలో నామినేటెడ్‌ సభ్యుడు, రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ హాజరయ్యారు.
మరో సభ్యుడు, ప్రతిపక్షనేత ఎన్.చంద్రబాబు నాయుడు ఈసమావేశానికి హాజరుకాలేదు. గైర్హాజరుకు కారణాలు తెలియరాలేదు.

You might also like