FbTelugu

రుణమాఫీ పేరుతో బాబు మోసం చేశాడు: పార్థసారథి

అమరావతి: రుణమాఫీ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశాడని వైసీపీ నేత పార్థసారథి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఏడాది కాలంలోనే జగన్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని అన్నారు.

వైసీపీ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. పేదవాడి సొంతింటి కలను జగన్ సాకారం చేయబోతున్నట్టు తెలిపారు. తాము రైతులకు చెప్పిన దానికంటే ఎక్కువే చేస్తున్నట్టు తెలిపారు.

You might also like