FbTelugu

చరిత్ర దాస్తే దాగదుగా: అయ్యన్న పాత్రుడు

వైసీపీ ఎంపీ వి. విజయ సాయిరెడ్డి ని చూస్తే జాలేస్తుందని ట్విట్టర్ లో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. వందల కోట్లు పోసి ప్రశాంత్ కిశోర్ (పీకే) తో అల్లుడు జగన్ రెడ్డికి ట్రైనింగ్ ఇప్పిస్తే లైవ్ తుస్సుమంది.

ఇక చేసేది ఏమీ లేక మాజీ మంత్రి లోకేష్ బాబు ప్రెస్ మీట్ లైవ్ లో చూసి ఊగిపోతున్నారు. లోకేష్ బాబు పెట్టిన సంతకాలకి కేంద్రం అవార్డులు పంపింది. జగన్ రెడ్డి పెట్టించిన సంతకాలకి సీబీఐ,ఈడీ ఛార్జ్ షీట్లు విడుదల చేసింది. వామ్మో నా కొడుకు దుర్మార్గుడు!అని రాష్ట్రంలో అడుగుపెడితే కాళ్ళు విరుస్తా అంటూ కొడుకు జగన్ రెడ్డిని, వైఎస్ఆర్ బెంగుళూరు ప్యాలెస్ కి పరిమితం చేసారు .చరిత్ర దాస్తే దాగదుగా అని ట్విట్టర్ దెప్పి పొడిచారు.

You might also like