FbTelugu

అయోధ్య వసూళ్లు రూ.150 కోట్లు

హైదరాబాద్: అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం తెలంగాణకు చెందిన 50 లక్షల మంది రూ.150 కోట్ల విరాళం ఇచ్చారని ఆర్ఎస్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రచారక్‌ దేవేందర్‌ వెల్లడించారు.

చిక్కడపల్లికి చెందిన పిడిశెట్టి ప్రభాకర్‌, ప్రవీణ్‌చంద్ర, సుజాత, పవన్‌చంద్ర, ప్రసీమ్‌చంద్ర, శీరిష కుటుంబ సభ్యులు రూ.11 లక్షల చెక్కులను మంగళవారం అందచేశారని ఆయన తెలిపారు. విరాళాల సేకరణ ఫిబ్రవరి 27వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున స్పందించి విరాళాలు అందచేస్తున్నారని, ఇంతగా స్పందన వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.