FbTelugu

విరాళాలు ఫుల్… వెండి ఇటుకలు వద్దు: అయోధ్య ట్రస్టు

అయోధ్య: రామాలయం నిర్మాణం కోసం వెండి ఇటుకలు పంపించవద్దని, వాటిని భద్రపర్చడం తలకు మించిన భారంగా ఉందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భక్తులను కోరింది.

ఇప్పటికే 400 ఇటుకలు బహూకరించారని, వాటిని భద్రపర్చడానికి స్థలం లేదని స్పష్టం చేశారు. ఆలయం కోసం వెండి ఇటుకలు అవసరం అయితే అప్పుడు ప్రకటన ఇస్తామని, అప్పటిదాకా ఎవరూ పంపించవద్దని కోరారు. నగదు రూపేణా విరాళాలు రూ.1600 కోట్లు సమకూరాయని ప్రకటించిది. చెక్కుల రూపంలో, డీడీ ద్వారా, నగదు బదిలీ ద్వారా ఈ మొత్తం వచ్చినట్లు పేర్కొన్నారు. విరాళాల కోసం దేశవ్యాప్తంగా ఒక లక్షా యాభై వేల గ్రూపులు పనిచేస్తున్నాయని రామ జన్మభూమి ట్రస్టు ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.