FbTelugu

ఉమా భారతి దూరం… దూరం..

భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి 5వ తేదీన అయోధ్య రామ మందిర భూమి పూజలో ప్రత్యక్షంగా హాజరు కావడం లేదు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు.
తనకు భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానం ఉన్నప్పటికీ అక్కడికి వెళ్లడం లేదని తెలిపారు. అయోధ్యకు వెళ్లేందుకు రైలులో బయలుదేరానని, పూజలో నేరుగు పాల్గొనకాం సరయు నది తీరంలో ఉండి వీక్షించనున్నట్లు ఆమె వెల్లడించారు. పూజా కార్యక్రమం ముగిసిన తరువాత రామ్ లల్లాను దర్శించుకోనున్నారు. అయితే బీజేపీ సీనియర్ నేతలు ఎల్ కె.అద్వాని, మురళీ మనోహర్ జోషీ, వీహెచ్ పీ నాయకులు అశోక్ సింఘాల్ లకు ఆహ్వానం పంపించలేదు. ప్రధాని మోదీతో పాటు మాజీ సీఎం కళ్యాణ్ సింగ్, వినయ్ కటియార్ లు పాల్గొంటున్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ కరోనా బారిన పడడం, యూపీ సాంకేతిక విద్యా శాఖ మంత్రి కరోనా పాజిటివ్ తో చనిపోవడంతో కార్యక్రమానికి హాజరయ్యే వారి పట్ల ఉమా భారతి ఆందోళన వ్యక్తం చేసింది.

You might also like