FbTelugu

భార్యపై గొడ్డలితో దాడి

ప్రకాశం : ఓ వ్యక్తి తన భార్యపై గొడ్డలితో అతి దారుణంగా దాడి చేయడంతో మృతి చెందిన దారుణ ఘటన జిల్లాలోని చీరాలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివలక్ష్మి, మల్లేశ్వరరావు భార్యాభర్తలు.

వీరు స్థానిక చీరాలలో నివాసం ఉంటున్నారు. కాగా మల్లేశ్వరరావు ఫుల్లుగా మద్యం సేవించి మద్యం మత్తులో భార్యపై గొడ్డలితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన శివలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. భార్య మృతి చెందడంతో మల్లేశ్వరరావు అక్కడినుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.