FbTelugu

వ్యాధిని గుర్తించలేకపోవడం విస్మయం: పవన్

అమరావతి : ఏలూరులో 140 మంది చిన్నారుల అస్వస్థత ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్నారని అన్నారు. ఇప్పటికీ ఆ వ్యాధేంటో కూడా వైద్యులు నిర్థారించలేకపోవడం విస్మయాన్ని కలిగిస్తోందని అన్నారు.

ఏలూరులో వాయు, జల కాలుష్యం పరిమితికి మించే ఉన్నాయని గతంలో జరిగిన సర్వేలలో వెల్లడైందని అన్నారు. ఏలూరులో ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయాలని అన్నారు. బధితులకు జనసేన నేతలు, కార్యకర్తలు అండగా ఉండాలని కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.