FbTelugu

అవార్డులే అవార్డులు

తెలంగాణ రాష్ట్రంలో స్కోచ్‌ అవార్డుల పంట పండింది. సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించుకోవడంలో రాష్ట్రం ముందంజలో ఉంది. ఈ విషయంలోనే రాష్ట్రానికి రెండు బంగారు, ఒక వెండి పతకాలు వచ్చాయి. త్వరలో నిర్వహించే స్కోచ్‌ సమ్మిట్‌లో ఈ అవార్డులను రాష్ట్రం అందుకోనుంది.

బ్లాక్‌ చెయిన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రాజెక్టుకు ప్రెస్టిజియస్‌ గోల్‌ అవార్డుకు కూడా తెలంగాణను ఎంపిక చేశారు. దీనిద్వారా ట్యాంపరింగ్‌కు అవకాశం లేని ల్యాండ్‌ రికార్డులను సీ డాక్‌ హైదరాబాద్‌ భాగస్వామ్యంతో అందజేస్తోంది. దీన్ని కూడా స్కోచ్‌ గుర్తించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చిట్‌ఫండ్‌ కార్యకలాపాల నిర్వహణకు బ్లాక్‌ చెయిన్‌ ఆధారిత వ్యవస్థ టి.చిట్స్‌కు సిల్వర్‌ మెడల్‌ లభించింది. ఈ అవార్డు తెలంగాణకు రావడం ఇది రెండోసారి. అదేవిధంగా డిజిటల్‌ ఇండియా కేటగిరీ కింద శాండ్‌ సేల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ మానిటరింగ్‌ ప్రాజెక్టును నిర్వహిస్తోన్న తెలంగాణ స్టేట్‌ మినరల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌కు బంగారు పతకం లభించింది.

కాగా తెలంగాణ రాష్ట్ర ఐటి మంత్రి కెటి రామారావు ఈ సంవత్సరంలో రెండు ఎఐ ఆధారిత ప్రాజెక్టులను ప్రారంభించారు. మేడారం జాతరలో లక్షలాది మంది భక్తులు హాజరైన క్రమంలోనూ పోలీసులకు ఉపయోగపడిన ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ సొల్యూషన్, సరైన రిజిస్ట్రేషన్‌ కార్యాలయాన్ని గుర్తించేందుకు అమలు చేస్తోన్న మేధా చాట్‌ బోట్‌ విధానాన్ని కూడా స్కొచ్‌ గుర్తించింది. తెలంగాణకు ఈ అవార్డులు రావడంతో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు.

You might also like