FbTelugu

గంటా పై మంత్రి అవంతి శ్రీనివాస్ భగ్గు

విశాఖపట్నం: తనపై ఉన్న కేసుల మాఫీ కోసం మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు వైసీపీలోకి చేరేందుకు మొగ్గు చూపుతున్నారని పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు సంచలన ఆరోపణలు చేశారు.

అధికారం ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటారని, అధికారం లేకపోతే ఉండలేరని ఆయన విమర్శించారు. సైకిళ్లు, భూ కుంభకోణాల్లో గంటా పీకలలోతు మునిగిపోయారని అన్నారు. ఆయన పార్టీలోకి వస్తే ఏం జరుగుతుంది, నష్టాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఎంపీ వి.విజయసాయి రెడ్డికి పూసగుచ్చి చెప్పానని అవంతి తెలిపారు. దొడ్డి దారిలో వైసీపీలోకి చేరేందుకు నానా కష్టాలు పడుతున్నారన్నారు. గత ప్రభుత్వంలో గంటాపై సహచర మంత్రి ఫిర్యాదు చేశారని ఆయన గుర్తు చేశారు.

You might also like