FbTelugu

ఘోరం… వాళ్లంతా చనిపోయినట్టేనా?

డెహ్రడూన్: చమోలీ జిల్లాలో మంచు చరియలు విరిగిపడి జలప్రళయం సృష్టించిన విషయం తెలిసందే. ఈ ఘటన జరిగి రెండు వారాలు అవుతున్న గల్లంతైన వారి మృతదేహాలు ఇంకా లభ్యం కావాల్సి ఉంది.
అధికార యంత్రాంగం అంచనా ప్రకారం ఈ ప్రళయంలో 204 మంది గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఇప్పటికీ కూడా గాలింపు చేపడుతునే ఉన్నారు. ఇప్పటి దాకా 68 మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా 136 మంది ఎక్కడున్నారనేది తెలియకపోవడంతో వారంతా జలప్రళయంలో గల్లంతైనట్లు అంచనాకు వచ్చారు. మరణించినట్లు ఆనవాళ్లు కూడా లభ్యం కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు కూడా బొమ్మలతో అంత్యక్రియలు కూడా నిర్వహించేశారు.

వీరి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లింపు ప్రధాన సమస్యగా మారింది. చనిపోయినట్లు నిర్థారించుకోకుండా చెల్లిస్తే, ఆ తరువాత బతికి వస్తే పరిస్థిత ఏంటనేది అధికారుల మనసును తొలుస్తున్నది. మరికొద్ది రోజులు ఆగిన తరువాత మరణించినట్లు జాబితా ప్రకటించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. అప్పటి వరకు వరకు వేచి ఉండక తప్పని పరిస్థితి మృతుల కుటుంబాలకు ఏర్పడింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.