FbTelugu

నేటి నుంచి ఆటోమేటిక్ ఈ-పాస్ లు జారీ

అమరావతి: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటోమేటిక్ ఈ-పాస్ లను జారీ చేయనుంది. కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి పాస్ ఉంటేనే అధికారులు అనుమతిస్తున్నారు.

కాగా పాసులు అందరికీ లేకపోవడంతో సరిహద్దు చెక్ పోస్టుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం స్పందన సైట్ లో దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఈ-పాస్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంది. అదేవిధంగా సరిహద్దు చెక్ పోస్టులలో నిబందనలను సడలించారు.

You might also like