FbTelugu

ఆటో బోల్తా… ఒక విద్యార్థి మృతి

గుంటూరు: క్రోసూరు మండలం 88 తాళ్లూరు గుడిపాడు రహదారిపై గురువారం ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 88 తాళ్లూరుకి చెందిన స్టాలిన్ అనే ఇంటర్ విద్యార్థి అక్కడికక్కడే చనిపోయాడు.

ఘటన జరిగిన సమయంలో ఆటోలో సత్తెనపల్లి ప్రగతి, కృష్ణవేణి, నలందా కాలేజీలలో చదువుతున్న 10 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. ప్రమాద ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ తో పాటు విద్యా సంస్థలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.