FbTelugu

మంత్రి కేటీఆర్ కు ఆస్ట్రేలియా ఆహ్వానం

Australias-invitation-to-Minister-KTR

హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా-ఇండియా లీడర్ షిప్ సదస్సు ఆహ్వానం లభించింది. డిసెంబర్ 8-9 తేదీల్లో ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ లో జరిగే నాలుగవ ఆస్ట్రేలియా-ఇండియా లీడర్ షిప్ సదస్సు జరగనున్నది. ఈ సదస్సుకు ఇరుదేశాల కీలక వ్యాపార, వాణిజ్య రంగాల ప్రతినిధులు హాజరుకానున్నారు. వివిధ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాల పైన చర్చించనున్నారు. దీంతోపాటు ప్రభుత్వాల మధ్య వివిధ అంశాల్లో భాగస్వామ్యానికి సైతం అవకాశం ఉండనున్నది. ఆస్ట్రేలియా – ఇండియా సంబంధాలు, వివిధ ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాలు, ఆర్థిక ఒప్పందాలు, వ్యాపార వాణిజ్య రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాల బలోపేతం దిశగా చేపట్టవలసిన కార్యాచరణకు సంబంధించి ఈ సదస్సులో చర్చిస్తారు.

You might also like