FbTelugu

భారత్ సాయం కోరిన ఆస్ట్రేలియా!

సిడ్నీ: ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో భయపడుతుంటే ఆస్ట్రేలియా దేశం మాత్రం ఎలుకలంటేనే హడలిపోతున్నది. లక్షల సంఖ్యలో పోగయిన ఎలుకలు పౌరులకు ముప్పుగా పరిణమించాయి.

న్యూ సౌత్ వేల్స్ లో కొన్ని రోజులుగా ఎలుకలు పంట పొలాలపై దాడి చేసి నష్టాన్ని కలుగ చేస్తున్నాయి. ఇళ్లు, దుకాణాలు, హోటళ్లలో ఇవి సంచరిస్తూ అనారోగ్యం కలుగ చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు వాటిని వదిలేయగా ఇఫ్పుడవి లక్షల సంఖ్యలో ఉండడంతో ఆస్ట్రేలియన్ ప్రభుత్వం వాటిని మట్టుబెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇలాగే వదిలేస్తే ప్లేగు వ్యాధి ప్రభలే ప్రమాదముందని వైద్య నిపుణులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమస్యనుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వం సాయాన్ని కోరింది. ఎలుక నివారణకు ఉఫయోగించే బ్రోమాడియోలోన్ ను దిగుమతి చేసుకునేందుకు ప్రతిపాదనలు పంపించింది. 5వేల లీటర్లను పంపించాలని కోరగా భారత్ అంగీకారం తెలిపింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ మందు తయారీని తమ దేశంలో నిషేధించింది. ఎలుకలను మట్టుబెట్టేందుకు ఇప్పుడు అదే మందు అవసరం పడింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.