FbTelugu

పి.ఎన్.బి తనఖా ఆస్తుల వేలం రేపే

న్యూఢిల్లీ: తనఖాలో ఉన్న ఆస్తులను పంజాబ్ నేషనల్ బ్యాంకు వేలం వేస్తున్నది. మంగళవారం నాడు ఈ వేలం ద్వారా ఈ ఆస్తులను విక్రయిస్తున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రకటించింది.

ఈ బిక్రి పోర్టల్ లెక్క ప్రకారం ఈ వేలంలో 12,855 ఇళ్లు, 2,804 వాణిజ్య స్థలాలు, 1,400 పారిశ్రామిక ఆస్తులు, 101 వ్యవసాయ భూములు ఉన్నాయి. అయితే వేలంలో పాల్గొనదలిచేవారు ముందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన కెవైసి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈఎండి సొమ్మును కూడా ఆన్ లైన్ లోనే బదిలీ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాతే బిడ్ వేసేందుకు అవకాశం ఉంటుందని పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.