FbTelugu

హైకోర్టు… మీ హక్కులు సవరించుకోవాలి…

మీ గ్యాగ్ ఆర్డర్ తో నా హక్కును కాలరాస్తున్నారు

హైకోర్టులో న్యాయవాది మమతా రాణి ఇంప్లీడ్ పిటీషన్

అమరావతి: ఏపీ హైకోర్టు అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ పై అడ్వకేట్ గలేటి మమతా రాణి ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేసింది.
ఈ కుంభకోణం కేసులో తనను అరెస్టు చేయవద్దంటూ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ దాఖలు చేసిన పిటీషన్ లో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలని మమతా రాణి తన పిటీషన్ కోరింది. అమరావతి రాజధాని భూ కుంభకోణానికి సంబంధించి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీ ఇద్దరు కుమార్తెలు, దమ్మాలపాటి శ్రీనివాస్ లపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో వివరాలను ప్రసారం చేయరాదంటూ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. దీనిపై పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాలు ప్రసారం చేయారాదని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ను మమతా రాణి ప్రశ్నించింది.

ఈ కేసులో పూర్తిస్థాయి నిషిద్ద ఉత్తర్వులు జారీ చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కులను భంగం కలిగించడమే అవుతుందని, హైకోర్టు ఇలా చేయడానికి వీల్లేదన్నారు. ప్రజాస్వామ్య మనుగడకు మీడియా హక్కులు అవసరమని తెలిపారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ తో తన హక్కులు ఎంతో ప్రభావితానికి గురయ్యాయని ఆమె ఆందోళన వెలిబుచ్చింది. ప్రజాస్వామ్యంలో పత్రికలు స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితులు ఉండాలని సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం గతంలో తీర్పునిచ్చిందని మమతా రాణి తన పిటీషన్ లో తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.