FbTelugu

ఒక రోజు అసెంబ్లీకి వీసీ ద్వారా ఎమ్మెల్యేల హాజరు

భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశం ఇవాళ ఉదయం ప్రారంభమైంది. ఒకరోజు అసెంబ్లీ సమావేశానికి స్పీకర్, సీఎం, ప్రతిపక్ష నేత, అసెంబ్లీ సిబ్బంది హాజరు అయ్యారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలక, విపక్ష సభ్యులు పాల్గొన్నారు. 230 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రస్తుతం 202 మంది సభ్యులే ఉన్నారు.

28 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఒకరోజు సమావేశంలో బడ్జెట్, ఆర్డినెన్స్ లు, ఇతర ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపచేయనున్నారు. కరోనా నేపథ్యంలో అసెంబ్లీని పూర్తిగా శానిటైజ్ చేసి, వాహనాలు, డ్రైవర్లను అసెంబ్లీ భవన సముదాయం ఆవరణలోకి రాకుండా నిరోధించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.