FbTelugu

ఏటీఎం దొంగతనానికి విఫలయత్నం

అనంతపురం: ఇద్దరు దుండగులు ఓ ఏటీఎంలో దొంగతనానికి విఫలయత్నం చేసి కుదరకపోవడంతో నిప్పంటించిన ఘటన జిల్లాలోని పరిగి మండలం, కొడిగెనహళ్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రాకారం.. స్థానిక కొడిగెనహళ్లి గ్రామంలోని ఇండియన్ బ్యాంకు ఏటీఎంలో ఇద్దరు దుండగులు దొంగతనానికి యత్నించారు.

కానీ వారికి డబ్బుదోచుకోవడం సాధ్యం కాకపోవడంతో ఏటీఎంకు నిప్పంటించారు. దీంతో ఏటీఎంలో ఉన్న రూ. 5.80 లక్షల నగదు కాలిపోయింది. రంగలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా నిందితుల్లో ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా గుర్తించారు. మరోకరి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.