FbTelugu

విజయసాయిపైనే హత్యాయత్నం చేశారు: మంత్రి శ్రీనివాస్

విశాఖపట్నం: వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి పైనే టీడీపీ నాయకులు హత్యాయత్నం చేశారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు.

రామతీర్థం దేవాలయం ఘటనను పరిశీలించేందుకు వచ్చిన ఆయనపై టీడీపీ నాయకులు ఆటవికంగా, పాశవికంగా దాడి చేశారని ఆయన అన్నారు. ఆయనకు బుల్లెట్ ఫ్రూప్ వాహనం లేకపోతే ప్రాణాలకే ప్రమాదం జరిగి ఉండేదని అన్నారు. పోలీసులు ఆధారాలు లేకుండా ఏ విధమైన చర్యలు తీసుకోరని, పరోక్షంగా టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్టను మంత్రి శ్రీనివాస్ సమర్థించారు.

చంద్రబాబు ఖాళీగా కూర్చోరని, ప్రతినిత్యం ఏదో ఒక పని ఉండాలని ఆయన విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరకుల పంపిణీ ప్రారంభిస్తుంటే, మంచి పేరు వస్తుందనే కుళ్లుతో టీడీపీ కుట్రలు చేస్తోందని అవంతి శ్రీనివాస్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.